PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన..

1 min read

– పట్టణాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

– మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ..

– హెల్త్ ఆఫీసర్ డాక్టర్:మాలతి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  స్వచ్చతాహి సేవ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఏలూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం  ఇండియన్ స్వచ్ఛత లీగ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం ద్వారా  ప్రజలకు స్వచ్ఛత పై అవగాహనా కలిపిస్తూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటి పరిసరాలు పరిశుభ్రత పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా  అంటు రోగాల బారిని పడకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని,  క్లీనింగినెస్  పై పట్టణ ప్రజలు అవగాహన పెంచుకోవాలని , పరిసరాల పరిశుభ్ర తో పాటు, మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని, ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు పట్టణంలోని శనివారపు పేట  శ్రీరామ్ నగర్ 7వ రోడ్ నందు క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.వెంకట కృష్ణ , మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ : మాలతి,డి ఇ, ఏఈ లు శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డ్ పర్యావరణ కార్యదర్శులు మరియు  యువతీ,యువకులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగినది.

About Author