PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాళీ పోస్టులను భర్తీ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  నంద్యాల డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ మరియు పట్టణ కార్యదర్శి శివ విలాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఏమాత్రం నిలబెట్టుకోలేదని వారు తెలిపారు, జాబ్ క్యాలెండర్ హామీపై చర్చించాలని వారు తెలిపారు, ప్రతి ఏటా చేప క్యాలెండర్ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు 40 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని ఇప్పటివరకు కేవలం 10,134పోస్టులకు మాత్రమే భర్తీ చేశారన్నారు, అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని వారు తెలిపారు, యువకులు బయట ఉన్నత చదువులు చదువుకొని చాలీచాలని జీతంతో పనిచేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు , ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలని వారు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని DSC నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనిపక్షంలో  DYFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు తెలిపారు.

About Author