పత్తికొండలో 11వ రోజు కొనసాగిన టిడిపి నిరాహార దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఏపీ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో అక్రమంగా అరెస్టు అయిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విడుదలను కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలి వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. టిడిపి పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో 11 వ రోజు నిరాహార దీక్షలు రామచంద్రాపురం గ్రామానికి చెందిన టిడిపి శ్రేణులు చేపట్టారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ, బాబు గారికి తోడుగా… ఒక్క నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షల్లో రామచంద్రపురం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరాహారదీక్ష శిబిరం వద్ద దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి, రామానాయుడు తిరుపాలు ఎం అశోక్ కుమార్ సింగం శ్రీనివాసులు లక్ష్మీనారాయణ రామచంద్రారెడ్డి రవీంద్ర చౌదరి మీరా సాహెబ్ సురేంద్ర వీటి గోవిందు శ్రీనివాసులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.