PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇ-వేలం ద్వారా గోధుమలు … బియ్యం అమ్మకాలు..

1 min read

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ లోని తన ప్రాంతీయ కార్యాలయాల ద్వారా OMSS(D) కింద

గోధుమలు మరియు బియ్యం అమ్మకాలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  బహిరంగ మార్కెట్లో గోధుమలు మరియు బియ్యం ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్- డొమెస్టిక్ ద్వారా, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియుప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలు & బియ్యం) ఇ-వేలం ద్వారా అందిస్తోంది. ఈ పథకం క్రింద, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గోధుమ ఉత్పత్తుల యొక్క ప్రాసెసర్లు / గోధుమ పిండి మిల్లర్లకు మాత్రమే గోధుమలను అందిస్తుంది (ట్రేడర్లు / బల్క్ కొనుగోలుదారులు అనుమతించబడరు). గోధుమల విషయంలో అర్హత కలిగిన బిడ్డర్ కనీసం 10 మెట్రిక్ టన్నుల నుంచి గరిష్టంగా 100 మెట్రిక్ టన్నులకు బిడ్ వేయడానికి అర్హులు. బియ్యానికి సంబంధించిన వేలంలో, వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు. బియ్యం విషయంలో కనిష్టంగా 10 మెట్రిక్ టన్నులు, గరిష్టంగా 1000 మెట్రిక్ టన్నుల కు బిడ్ వేయడానికి అర్హులు. ఇ- వేలంలో పాల్గొనదలచినబిడ్డర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్, జి.ఎస్.టి. / ట్రేడ్ టాక్స్ రిజిస్ట్రేషన్, పాన్ కలిగి ఉండాలి మరియు గోధుమల ఈ-వేలానికి సంబంధించి భారత ప్రభుత్వ డబ్ల్యు.ఎస్.పి. పోర్టల్లో ప్రస్తుత గోధుమల స్టాక్ హోల్డింగ్ను ప్రకటించాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్, అమరావతి ప్రతి శుక్రవారం ఎఫ్సీఐ డిపోల వద్ద ఉన్న నిల్వల నుండి గోధుమలు మరియు బియ్యాన్ని http://www.valuejunction.in/fci వద్ద m- జంక్షన్ ప్లాట్ఫారమ్ ద్వారా గోధుమలు (FAQ) క్వింటాలుకు రూ.2150, గోధుమలు (URS) క్వింటాలుకు రూ.2125, సాధారణ బియ్యం క్వింటాలుకు రూ.2900, ఫోర్టిఫైడ్ బియ్యం క్వింటాలుకు రూ.2973 చొప్పున వర్తించే పన్నులతో కలిపి అందిస్తోంది.ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి, 27.09.2023న జరగబోయే ఇ-వేలం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2000 MTల గోధుమలను మరియు 50,000 MTల బియ్యాన్ని ఆఫర్ చేస్తోంది. ఇందులోకేంద్ర పాలిత ప్రాంతమైన పోర్ట్ బ్లెయిర్ కోసం 200 MTల గోధుమలు కుడా కలుపబడ్డాయని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు.

About Author