NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 వినాయకుడిని భక్తి ప్రపత్తులతో పూజించాలి

1 min read

– మాతృశక్తి నగర కన్వీనర్ శ్రీమతి భార్గవి…

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు:  ఎప్పుడూ ఆదిపూజలందుకునే గణేషుడు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం శాస్త్రవిధి ఐతే చదువుకునే పిల్లలు మరీ ముఖ్యంగా ఆ గణేషుని పూజించడం అత్యావశ్యకం ఎందుకంటే వినాయకుని రూపంలో అత్యంత దైవిక,ఆద్యాత్మిక,సామాజిక అంశాలు మిళితమై ఉన్నాయి…చిన్న కళ్ళు స్ఫూరదృష్టికి,పెద్ద చెవులు సూక్ష్మ గ్రాహ్యనికి, బానపోట్ట అన్ని విషయాలను సంగ్రహించి డానికి, తొండం విశేష కార్యాలు చేయడానికి ఇలా ఎన్నో రకాల విశేషాలతో కూడిన గణేశ విగ్రహాన్ని పూజించడం తో విశేషంగా ఆ శ్రీ గణేశుడి కృపవల్ల విద్యాబుధ్ధులు వస్తాయని విశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగరంలో మాతృశక్తి విభాగం ఆధ్వర్యంలో..శ్రీ అభయాంజనేయ స్వామి ప్రఖంఢ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం,శరీన్ నగర్ లో విజ్ఞాన వికాస్ బాలసంస్కార కేంద్రం బాలబాలికలతో ఈ రోజు ఉ.10:00 గం.లకు ” గరిక ” పూజ(దూర్వాయుగ్మ పూజ) అనంతరం మాతృ శక్తి నగర కన్వీనర్ శ్రీ మతి భార్గవి తెలియజేశారు…తరువాత నైవేద్యం చేసిన కుడుములు ప్రసాదంగా విద్యార్థులకు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో 60 మంది బాలసంస్కార కేంద్రం పిల్లలు,భక్తులు పాల్గొన్నారు.

About Author