గణష్ నిమజ్జనం ఉత్సవాన్ని ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి.. జిల్లా ఎస్పీ
1 min read2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు.
సెప్టెంబర్ 26 తేదిన గణేష్ నిమజ్జనం … కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు.
గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సెప్టెంబర్ 26 (మంగళవారం) న గణేష్ నిమజ్జన ఉత్సవం సంధర్బంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భారీ బందోబస్తు చర్యలు చేపట్టిందని, ప్రశాంత వాతవరణంలో శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బందోబస్తు వివరాలను వెల్లడించారు.
14 మంది డిఎస్పీలు , 46 మంది సిఐలు/ ఆర్ ఐలు, 82 మంది ఎస్సైలు / ఆర్ ఎస్సైలు, 236 మంది ఎఎస్సై మరియు హెడ్ కానిస్టేబుల్స్, 601 మంది పోలీసు కానిస్టేబుల్స్ , 342 మంది హోంగార్డులు, 3 స్పెషల్ పార్టీ బృందాలు మరియు ఎపీ ఎస్పీ పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మొహరింపజేశాము. నిబంధనలకు ఎవరు విరుద్ధంగా ప్రవర్తించినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాము. బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు, నిమజ్జనం కార్యక్రమం అంతా డ్రోన్, సిసికెమెరాలు, వీడియో కెమెరాలతో చిత్రికీరిస్తాం, అసాంఘిక శక్తులు, అల్లరి మూకల పై గట్టి నిఘా ఉంచుతాము. విగ్రహాలను తరలించడానికి ముందురోజే వాహనాలను మరియు క్రేన్ లను సిధ్దంగా ఉంచుకోవాలి.చిన్న పిల్లలు నిమజ్జన ఊరేగింపు వాహనాలకు దూరంగా ఉండాలి. నిమజ్జన ఘాట్ల దగ్గర కు నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే మహిళలు, వృద్దులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. విగ్రహాలు బయలు దేరేటప్పుడు కరెంటు తీగల వద్ద గణేష్ నిర్వహకులు తగిన జాగ్రత్తలు పాటించాలి.ఆసుపత్రుల దగ్గర రోగులకు ఇబ్బందులు కలిగించరాదు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయములో ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారించరాదు .హోరెత్తించే లౌడ్ స్పీకర్లు, డిజేలతో అధిక శబ్దాలతో ఆకతాయిలు మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం. మతపెద్దలు, రాజకీయ పార్టీలు, శాంతి కమీటి సభ్యులు, యువత, శాంతియుత వాతావారణంకు సహాకరించాలని, మీడియా కూడా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సహాయ సహాకారాలు అందించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.నిమజ్జనం సంధర్బంగా కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు….వాహనచోదకులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహాకరించాలి. గణేష్ నిమజ్జనం సంధర్బంగా సెప్టెంబర్ 26 వ తేది మంగళవారం ఉదయం 10 గంటల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ ను మళ్లించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు తెలిపారు. అత్యవసర ( 108, ఫైర్ , అంబులెన్సులు, పోలీసు వాహనాలు) సేవల కోసం పోలీసు వారితో అనుమతి పొందిన వాహనాలు మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతిస్తారు.1) కర్నూలు ఆర్టీసి బస్టాండ్ మీదుగా రాజ్ విహార్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, వినాయక్ ఘాట్, మద్దూర్ నగర్, రోడ్డు భవనాల శాఖ మీదుగా వాహనాల రాకపోకల నిషేధం ఉంటుంది. ఆ వాహనాలను బళ్ళారి చౌరస్తా నుండి కల్లూరు మీదుగా జాతీయ రహాదారి కి మళ్ళిస్తారు.
2) ఆత్మకూరు, నంద్యాల, నందికోట్కూరు, నంద్యాల చెక్ పోస్టు వైపు నుండి నగరంలోనికి వచ్చే వాహనాలు సి. క్యాంపులోని రైతుబజారు, బిర్లాగేట్ మీదుగా , గుత్తి పెట్రోల్ బంక్ బై పాస్ రోడ్డు నుండి కల్లూరు, బళ్ళారి చౌరస్తా మీదుగా కర్నూలు RTC బస్టాండ్ కు చేరుకుంటాయి. 3) హైదరాబాద్, గద్వాల, అలంపూర్ నుండి వచ్చే వాహనాలు మామిదాలపాడు తుంగభద్ర బ్రిడ్జి జంక్షన్ క్రాస్ నుండి కర్నూలు నగరంలోనికి రాకుండా జాతీయరహాదారి మీదుగా కర్నూలు RTC బస్టాండుకు చేరుకుంటాయి. 4) అనంతపురం నుండి వచ్చే వాహనాలు గుత్తి పెట్రోల్ బంకు నుండి బైపాస్ మీదుగా ఆర్టీసి బస్టాండ్ చేరుకుంటాయి.నిమజ్జనం పూర్తయిన తర్వాత వాహనాలు దేవనగర్ మీదుగా కృష్ణ నగర్ & కల్లూరు బ్రిడ్జి మీదుగా బయటకు వెళతాయి.గణేష్ నిమజ్జన వేడుకల్లో ఏ చిన్న పాటి సంఘటన చోటు చేసుకున్నా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ హెచ్చరించారు.