రైతులు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకోవాలి…
1 min read– పంటల విషయాలలో రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించటం మేలు..
– సేంద్రీయ పద్ధతులు ద్వారా అధిక దిగుబడులు ఆరోగ్యం..
– మండల వ్యవసాయ అధికారి ఎం ప్రియాంక వెల్లడి..
– ఏరువాక కోఆర్డినేటర్ రైతులతో సూచనలు, సలహాలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రైతులు మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా పంటలు సాగుచేయాలని పెదవేగి మండల వ్యవసాయాధికారి ఎం ప్రియాంక సూచించారు. మండలం లోని అమ్మపాలెం గ్రామం లో శని వారం ఏలూరు జిల్లా ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్ డాక్టర్ ఫణికుమార్ టి సుజాత.వి ఏ లు.వి హెచ్ ఏ లు తో కలిసి అమ్మపాలెం లో రైతులతో కలిసి పొలం బడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భం గా ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్ ఫణి కుమార్ మాట్లాడుతూ పంటలపై ఆశించే చీడ పురుగులను రైతులు ఎప్పటికప్పుడు గమనించి వ్యవసాయాధికారుల సలహాలు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా పంటల పై ఎక్కువగా దిగుబడి. ఆరోగ్యం వస్తుందని ఆధునిక రసాయన పద్ధతులు పాటించవద్దని తెలియజేశారు. భవిష్యత్ కాలంలో తద్వారా మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ పక్రియ కు నివారణ చేసే విధంగా ప్రతి రైతు సేంద్రీయ పద్ధతులను పాటించాలన్నారు. సహజంగా పంటలకు ఎక్కువగా ఆకుముడత.సుడిదోమ. పురుగు ఆసిస్తుందని చెప్పారు. వాటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రతి పంట విషయంలో వ్యవసాయ అధికారుల సూచన, సలహాలను ఉచితంగా పొందవచ్చని, రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గ దర్శకంగా ఆర్.బి.ఐ కేంద్రాల ద్వారా ఆధునిక రైతు సంక్షేమ విషయం తెలియజేస్తుందని, వ్యవసాయ అధికారుల ద్వారా ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వ్యవసాయ.ఉద్యాన శాఖల అధికారులు రైతులతో కలిసి పొలం బడి క్షేత్రాన్ని సందర్శించారు.