కర్నూలుకు చేరుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు
1 min read(కాచిగూడ- యశ్వంత్ పూర్) కు ఘన స్వాగతం పలికిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్,
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ దేశంలో ఈరోజు 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించగా అందులో ఒకటి కర్నూలుకు చేరుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (కాచిగూడ- యశ్వంత్ పూర్) కు కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ఘన స్వాగతం పలికారు.ఆదివారం కర్నూలు సిటీకి చేరుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (కాచిగూడ- యశ్వంత్ పూర్) కు ఘన స్వాగతం పలికిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బివై. రామయ్య, బిజెపి పార్టీ నాయకులు తదితరులు.పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు భారతదేశంలో ఢిల్లీ నుండి వర్చువల్ విధానం ద్వారా 9 రైళ్ళను ప్రారంభించడం జరిగిందని అందులో రెండు రైళ్లు మన ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (కాచిగూడ- యశ్వంత్ పూర్) కర్నూలు మీదుగా వెళ్లడం వల్ల చాలా సంతోషమని వ్యక్తము చేశారు, గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో జరిగిన తప్పులను సవరిస్తున్నందుకు భారత ప్రధానికి ధన్యవాదాలు అన్నారు, వందే భారత్ రైలు కర్నూలు మీద నడిచేలా అవకాశం కల్పించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూల్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు మన రాష్ట్రం గుండా రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైనయని, అదేవిధంగా సికింద్రాబాద్ నుండి కర్నూలు మీదుగా వైజాగ్ వెళ్లేలా ఒక వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడిచేలా ఎంపీ గారు కృషి చేయాలన్నారు. కర్నూలు నుండి నంద్యాలకు ఒక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందన్నారు. కావున ఈ సౌకర్యాన్ని కలిగించేలా మన ఎంపీ గారు కృషి చేయాలని సభాముఖంగా కోరారు. కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు మన కర్నూల్ సిటీ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడవడం చాలా సంతోషమని ఈ సౌకర్యం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూల్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బి వై రామయ్య గారు మాట్లాడుతూ కర్నూలుకు ఈ రైలు రావడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ రైలు ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది అని అన్నారు. ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి వలన కర్నూలు రైల్వే స్టేషన్ ను విమానాశ్రయం లాగా ఏర్పాటు చేశారని , డబల్ లైను ఎలక్ట్రిఫికేషన్ జరుగుతున్నదని , దూపాడు- నంద్యాల మరియు మంత్రాలయం- శ్రీశైలం లకు కూడా కొత్తగా రైలు వచ్చే విధంగా కృషి చేయాలని ఆ విధంగా రైల్వే అధికారులు రిపోర్టులు పంపాలని కోరారు.భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి (స్పొక్స్ పర్సన్) డాక్టర్ వినూషా రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్ల ఈరోజు మన కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్ ఎంతో ఆధునికరించబడిందని వారి కృషి వల్లనే మన రాష్ట్రం గుండా రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైనందుకు నరేంద్ర మోడీ గారికి కర్నూల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.సీనియర్ డి ఈ ఈ తేజ మాట్లాడుతూ ఈ రైలులో స్లైడింగ్ డోర్లు , ఎమర్జెన్సీ లైట్లు , జి.పి.ఎస్ సిస్టం , మొబైల్ ఛార్జింగ్ , ప్యాంట్రీ కారు , ఎమర్జెన్సీ ద్వారాలు , ఫైర్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ , ఎమర్జెన్సీ అలారం , డ్రైవరు – గార్డు సంభాషించుకోవడానికి సదుపాయము మరియు సంబంధిత రికార్డింగ్ , సుఖంగా కూర్చోవడానికి సీట్లు , సీట్లు పూర్తిగా తిరుగు సదుపాయం కలిగినవి మొదలగు ఏర్పాట్లతో సుఖవంతమైన ప్రయాణానికి కావలసిన అన్ని సదుపాయాలు పొందుపరిచి ఉన్న రైలు పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయము పొందుపరిచి ఉన్నది తెలిపారు.అనంతరం కర్నూలు చేరుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు నగర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పచ్చ జెండా ఊపి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ నగరపాలక కార్పొరేటర్లు, రైల్వే స్టేషన్ మేనేజర్, రైల్వే శాఖ సిబ్బంది, ఎన్సిసి విద్యార్థులు, వివిధ పాఠశాల విద్యార్థులు , ప్రజాసంఘాలు తదితరులు పాల్గొన్నారు.