మునిసిపల్ హాల్ లో స్పందన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మునిసిపల్ హాల్ లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించబడినది. ఇందులో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ. భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్ , అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.1.బంగారుపేట కి చెందిన శ్రీమతి శారదమ్మ మరియు ఇతరులు తమ వీధి యందు ఈగలు. దోమల బెడద ఉన్నాడని, తద్వారా దుర్వాసన సమస్య తలెత్తుతున్నదని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్యకి ఒక పరిష్కారము చూపవలసినదిగా కమీషనర్ ని కోరారు.2. జొహరాపురం, బీడీ వర్కర్స్ కాలనీ కి చెందిన శ్రీ షరీఫ్ ఇతరులు తమ వీధి యందు త్రాగు నీరు మరియు రోడ్డ్లు లేకపోవటం వలన తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నామని, కావున ఈ సమస్యను వీలైనత త్వరగా పెరిష్కరించావలసినదిగా కమీషనర్ని కోరారు. 3. జుడిషియల్ కాలనీ కి చెందిన శ్రీ ఆచారి మరియు ఇతరులు తమ వీధి యందు మురుగు నీటి వ్యవస్థ మరియు రోడ్డ్లు లేకపోవటం వలన తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నామని, కావున ఈ సమస్యను వీలైనత త్వరగా పెరిష్కరించావలసినదిగా కమీషనర్ని కోరారు. 4. పాత కర్నూలు కి చెందిన శ్రీమతి సఫూర ఖాతూన్ , తమకు గతం లో టిడ్కో ఇల్లు మంజూరు అయినదని, ప్రభుత్వ నిర్ణీత రుసుము కూడా కట్టి ఉన్నామని, కాని ప్రస్తుత పరిస్థితి వలన తాము మిగులు రుసుము కట్టలేమని, కావున కేటాయించిన గృహము రద్దు చేసి, తాము కట్టిన రుసుము తమకు తిరిగి ఇవాలని కమీషనర్ గారిని కోరారు. 5. విజయలక్ష్మి నగర్ కి చెందిన శ్రీమతి రత్నమ్మ గారు , తమకు గతం లో టిడ్కో ఇల్లు మంజూరు అయినదని, ప్రభుత్వ నిర్ణీత రుసుము కూడా కట్టి ఉన్నామని, కాని ప్రస్తుత పరిస్థితి వలన తాము మిగులు రుసుము కట్టలేమని, కావున కేటాయించిన గృహము రద్దు చేసి, తాము కట్టిన రుసుము తమకు తిరిగి ఇవాలని కమీషనర్ ని కోరారు. 6. బృందావన్ కాలనీ కి చెందిన శ్రీ సుధాకర్ రెడ్డి తమ వీధి యందు రోడ్డు వ్యవస్థ సరిగా లేదని, అలాగే కంప చెట్ల వలన తీవ్ర ఇబ్బంది కలుగుతున్నదని, దీని గురించి చర్యలు తీసుకోవాలని కమీషనర్ని కోరారు. 7. వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, రిచ్మండ్ విల్లాస్ కి చెందిన శ్రీ కోదండ పాణిగారు మరియు ఇతరులు, తమ వీధి యందు త్రాగు నీటి సమస్య ఉన్నాడని, కావున వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించ వలసినదిగా కమీషనర్ని కోరారు.8రాందాస్ నగర్ కి చెందిన శ్రీ. బి.ఎస్.ఎస్ రెడ్డి ఇతరులు తమ వీధిన కొత్త సి.సి. రోడ్డు కేటాయించి, రోడ్డు వేయవలసినదిగా కమీషనర్ ని కోరారు.
ఈ రోజు సోమవారం స్పందన కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ. భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్ , ఎస్.ఈ. శ్రీ. వేణుగోపాల్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీ మోహన్ కుమార్ గారు, ఎంహెచ్వో శ్రీ విస్వేస్వర్ రెడ్డి గారు, మేనేజర్ శ్రీ చిన్న రాముడు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.