కిలో మామిడి పళ్లు రూ.2లక్షలు.. ఎందుకంత ధర ?
1 min readపల్లెవెలుగు వెబ్: టాయో నో టమాగో .. ఇదొక మామిడి పండు రకం. దీని ధర అక్షరాలా కిలో 2 లక్షలు. నమ్మశక్యం కాదు కానీ.. ఇది నిజం. ఈ రకం మామిడి జపాన్ లో అభివృద్ధి చెందింది. దీనిని ఎగ్ ఆఫ్ సన్ అని కూడ మరో పేరుతో పిలుస్తారు. ఒక జత టయో నో టమాగో రకం మామిడి పళ్ల ధర 50 డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 3700 రూపాయలు. ఇంత ధర ఎందుకు ఉంది అని మీకు ఆలోచన రావొచ్చు. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
ప్రత్యేకత ఏమిటి :
ఈ రకం మామిడిని పాలీహౌస్ లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక ఉష్ణోగ్రత, వాతావరణంలో పెంచుతారు. వీటికి అవసరమైన సూర్యరశ్మిని మాత్రమే అందేలా చేస్తారు. ఫలితంగా వీటి రంగు ప్రత్యేకంగా..పూర్తీగా ఎరుపు రంగులో ఉంటుంది. కేవలం ఒక కొమ్మకు ఒక మామిడి పండు మాత్రమే వచ్చేలా .. ప్రూనింగ్ చేస్తారు. ఫలితంగా ఆ పండుకు పోషకాలు తగినంత అందుతాయి. ఈ మామిడి పండు పూర్తీగా పండిన తర్వాత నేల మీద రాలుతుంది. నేల మీద రాలినప్పుడు దుమ్ము, ధూళిని తాకకుండా.. మామిడి పండు కింద ఒక నెట్ ను కడతారు. ఫలితంగా పండు పక్వానికి వచ్చి రాలిన వెంటనే ఈ నెట్ మీద పడుతుంది. దీంతో పండు చాలా శుభ్రంగా ఉంటుంది. పండు కూడ చాలా రుచిగా ఉంటుంది. జపాన్ లో ఈ మామిడి పండ్లను ఖరీదైన వస్తువుగా చూస్తారు. వివిధ ఫంక్షన్లలో ఈ మామిడి పండ్లను గిఫ్ట్ గా అందిస్తారు. అత్యంత జాగ్రత్తగా.. ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పెంచడం ద్వార వీటి ధర ఎక్కువగా ఉంటోంది. జపాన్ లో చాలా మంది వ్యాపారులు వీటికి అధిక ధర ఇచ్చి కొనేందుకు మొగ్గుచూపుతారు. ఫలితంగా రైతులు కూడ వీటిని పండించేందుకు ఆసక్తి చూపుతారు.