సమంత క్షమాపణ చెప్పాలి..!
1 min readపల్లెవెలుగు వెబ్: హీరోయిన్ అక్కినేని సమంత తమిళ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాలని సీనియర్ నటుడు మనోబాల డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ తమిళుల్ని కించపరిచే విధంగా ఉందని మనోబాల ఆరోపించారు. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమ నుంచి ఈ వెబ్ సిరీస్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వెబ్ సిరీస్ తమిళ ప్రజల మనోభావాల్ని ఇబ్బందిపెట్టే విధంగా ఉందని ఆయన అన్నారు. ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు సమంత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కథను ఎంచుకునే ముందు సమంత కొంత ఆలోచించాల్సిందని, నిర్మాణ సంస్థ పూర్తీ బాధ్యత తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని మనోబాల తెలిపారు.