శౌర్య జాగరణ యాత్ర జయప్రదం చేయండి
1 min readశౌర్య జాగరణ యాత్ర కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం:
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రమైన,విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సారాలు పూర్తచేసుకున్న సందర్భంగా…. ప్రపంచ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ షష్ఠయ్యబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తునారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా హిందూ యువతను జాగృతం చేసేందుకు ” శౌర్య జాగరణ యాత్ర”ను సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి అక్టోబర్ 14 వ తేదీ వరకు రాష్ట్రంలోని 26 జిల్లాలో, జిల్లా వారి రథ యాత్రలు చేపట్టాలని పెద్దలు నిర్ణయించారు… అదే విధంగా మన ఆదోని ప్రాంతంలో కూడా సెప్టెంబర్ 30 నుంచి శౌర్య జాగరణ యాత్ర మొదలవతుందని, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొనలని విశ్వ హిందూ పరిషత్ కౌతాళం ప్రఖండ అధ్యక్షులు మారుతి మోహన్ రవి శంకర్, చంద్రశేఖర్, నరేష్, తెలిపారు. హిందువుల చైతన్యం కోసం మరుగున పడుతున్న హిందూ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తి చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధిలో యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భీమ రెడ్డి జిల్లా కార్యదర్శి జి హనుమంత్ రెడ్డి గ జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ రవిశంకర్ కార్యక్రమానికి వచ్చేసిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మరియు హిందూ బంధువులు, భీమ్ రెడ్డి, పులికొండప్ప , సోమిరెడ్డి,శివ, నవీన్ కుమార్, విజయ్ కుమార్,రంగస్వామి, వడ్డే వీరేష్, రామలింగ, భీమయ్య పాల్గొని ఈ కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది.