PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష ను ప్రజలందరూ వినియోగించుకోవాలి

1 min read

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్నజగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా  ఉచిత వైద్య పరీక్షలు ప్రజలందరూ  వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని, ఎం ఓ ఏపీ హెల్త్ మొబైల్ యాప్ లో సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని, బిపి, షుగర్ మరియు హెచ్ బి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, చంటి పిల్లలు, గర్భవతులు మరియు దివ్యాంగుల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచేందుకు … రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం లోని కాటిమాయకుంట గ్రామంలో  ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య సురక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, 104 వాహనాన్ని, వైద్యులు ఉచితంగా నిర్వహిస్తున్న పరీక్షలను, అందజేస్తున్న మందులను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ పర్యవేక్షించారు. వైద్య  పరీక్షల కోసం నలుగురు  వైద్యులను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్ కు  తెలియజేశారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి వైద్యుడు లేదా వైద్యురాలి వద్ద  తప్పనిసరిగా డిజిటల్ అసిస్టెంట్, కంప్యూటర్ మరియు ప్రింటర్  ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య సురక్ష కేంద్రానికి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని మరియు వారి ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టులను ఏ విధంగా తీసుకుంటున్నారని అడగగా… వైద్య అధికారులు దానికి సమాధానం ఇస్తూ… వారి సమాచారాన్ని మరియు వారి ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టులను… ఎం ఓ ఏపీ హెల్త్ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. ఎం ఓ ఏపీ హెల్త్ మొబైల్ యాప్ లో సమాచారాన్ని పొందుపరిచేందుకు డిజిటల్ అసిస్టెంట్ల సేవలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆరోగ్య సురక్ష కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న వైద్య పరీక్షల గురించి వైద్యులకు మరియు ఇతర అధికారులకు కలెక్టర్ సూచనలిస్తూ…. వైద్య పరీక్షల కోసం వచ్చిన ప్రతి ఒక వ్యక్తికి… కేసు షీట్ తప్పనిసరిగా ఉండాలని, బిపి, షుగర్ మరియు హెచ్ బి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, దివ్యాంగులకు, చంటి బిడ్డలకు మరియు గర్భవతులకు త్వరగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భవతులకు పరీక్షల నిమిత్తం గైనకాలజిస్టును కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఇంకొక  వైద్యుడు లేదా వైద్యురాలి యొక్క సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సురక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన 104 వాహనాన్ని పరిశీలిస్తూండగా… వాహనంలో ఈ.సీ.జీ. పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను మరియు మందులను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కేంద్రానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను, మరియు ఒక పిల్ల వాడిని…  వారి ఆరోగ్య సమస్యలను కలెక్టర్ అడగగా వారి సమస్యలను కలెక్టర్ కు వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.  ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ కొండయ్య,  డి సి హెచ్ ఎస్ డేవిడ్ సుకుమార్, రాయచోటి ఎంపీడీవో మల్ రెడ్డి , గ్రామ సర్పంచ్ ఖాదర్ వల్లి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author