PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్యాల గుట్టలపై వైసీపీ నాయకుల పెత్తనం…

1 min read

రైతుల భూములు కబ్జా.. బెదిరిస్తూ అక్రమ దందా.

వైకాపా నేత పొలం కబ్జా చేశారంటూ రైతు తహశీల్దార్ కు పిర్యాదు.

వైసీపీ నేతలకు అమాయక రైతులే టార్గెట్ అంటున్న గ్రామ ప్రజలు.

న్యాయం చేయాలని తహశీల్దార్ ను ఆశ్రయించిన రైతు.

రైతును చంపుతామమంటూ బెదిరింపులు..

న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్ళిన పత్రికేయులపై వైకాపా నేత దాడి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైసీపీ రాష్ట్ర యువ  నాయకుడు పేరు చెప్పుకుంటూ అక్రమ ధనార్జన నే ధ్యేయంగా కబ్జాలు చేయడం, అమ్ముకోవడం సొమ్ము చేసుకోవడం వారికి పరిపాటిగా మారింది. సాగు చేసుకుందామని వారి సొంత పొలాలకు ఆ రైతులు వెళితే ఆ  అమాయక రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి సొంత పొలాలని కబ్జా చేస్తూ అక్రమార్జనలకు పాల్పడుతున్నాడు ఆ వైకాపా నాయకుడు. తమ పొలాలను సాగు చేసుకునేందుకు వెళ్లిన రైతు తన పొలం జేసిబి పెట్టి చుట్టూ మట్టిని వేస్తుంటే చూసి అవాక్కైన ఆ రైతు నా పొలం ఎందుకు ఇలా చేస్తున్నారని  అడిగితే ఆ రైతుపైనే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇదే విషయాన్ని బాధిత రైతు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో మండల తహశీల్దార్ రాజశేఖర్ బాబుకు మొరపెట్టగా పరిశీలించి న్యాయం చేస్తామని తహాసిల్దార్ హామీ ఇచ్చారు. ఇదే విషయంపై నందికొట్కూరు విలేకరుల ఎదుట బాధిత రైతుల వద్ద మొరపెట్టుకుంటే న్యూస్ కవరేజ్ కు వెళ్లిన విలేకరులను సైతం  లెక్కచేయకుండా ఆ వైసీపీ నాయకుడు దాడికి పాల్పడిన సంఘటన నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. నందికొట్కూరు మండల పరిధిలోని శాతనుకోట గ్రామానికి చెందిన రైతు లక్కం రామ లచ్చమ్మకు మల్యాల గ్రామ పొలిమేరలో సర్వేనెంబర్ 172లో నాలుగు ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని 1992లో పట్టాను అప్పటి తహాశీల్దార్ మంజూరు చేశారు. సోమవారం రోజు లక్కం రామ లచ్చమ్మ కుమారుడు లక్కం లక్ష్మీనారాయణ ఆ పొలాన్ని సాగు చేసుకునేందుకు వెళ్లగా అప్పటికే మల్యాల గ్రామానికి చెందిన వైకాపా నేత జంగాల కుమారి శ్రీనివాసులు కబ్జా చేసి దౌర్జన్యంగా బౌండరీ హద్దులు ఏర్పాటు కొరకు జెసిబి తో పనులను చేపట్టారు. మా పొలంలో మీరు ఏ విధంగా జెసిబి తో పనులు చేపడుతున్నారని శాతనకోట గ్రామానికి చెందిన పొలం యజమాని లక్ష్మీనారాయణ పనులను అడ్డుకున్నారు. ఈ పొలం నీకు సంబంధం లేదు. నువ్వు రావొద్దు. అడ్డు వస్తే ఎంతకైనా తెగిస్తానని రైతు లక్ష్మినారాయణను భయభ్రాంతులకు గురిచేశారు. వెంటనే నందికొట్కూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో జరిగిన విషయంపై తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న పాత్రికేయుల కు ఆ రైతు జరిగిన విషయం తెలపగ నందికొట్కూరు పాత్రికేయులు వార్త కవరేజ్ కొరకు పొలం వద్దకు వెళ్ళారు. అక్కడే ఉన్న వైకాపా నేతలు జంగాల శ్రీనివాసులు మరియు గ్రామ సర్పంచ్ భర్త ఎల్లనాయుడు విలేకరులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. న్యూస్ కవరేజ్ కొరకు వచ్చిన పాత్రికేయులపై అనవసరంగా దాడికి పాల్పడి దుర్భాషలాడటం పద్ధతి కాదని ఎంత చెప్పినా వినకుండా విలేకరులని కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ప్రజా సంఘాల నేతలపై కూడా దురుసుగా ప్రవర్తించారు. పాత్రికేయులపై దుర్భాషలాడి దాడికి పాల్పడిన జంగాల కుమారి శ్రీనువాసులపై కేసు నమోదు చేయాలని నందికొట్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్యాల గ్రామంలో వైకాపా నేతలు  పార్టీ నేతల పేరు చెప్పుకొని గ్రామ నేతలు అక్రమాలకు పాల్పడుతూ వైకాపా నేతలకు చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. నేతల పేర్లు చెప్పి వారికి చెడ్డపేరు తీసుకువస్తున్న ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

About Author