వ్యవసాయేతర భూములకు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి
1 min read– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: వ్యవసాయేతర భూములకు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని ఆదోని సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆదోని మండలంలోని సలకలకొండ, మాదిరే, బల్లేకల్, నారాయణపురం, గ్రామాలలో క్షేత్రస్థాయిలో సబ్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… వ్యవసాయ భూములకు వ్యవసాయేతర భూములుగా మార్చుకొనుటకు మార్కెట్ విలువ 5% శాతం ప్రభుత్వ నిబంధనలు ప్రకారం గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న వాటిని NALA ACT ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల సర్వేయర్ రమణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయరాం రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.