కోట్ల విజయభాస్కర్ రెడ్డి 22వ వర్ధంతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: గౌరవనీయులైన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 22వ వర్ధంతి కార్యక్రమం ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం, కర్నూలు జిల్లా tv సహాయ కార్యదర్శి అమానుల్లా ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రివర్యులు మచ్చలేని మహానాయకుడు కోట్ల భాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు అదే కాకుండా కేంద్ర సహాయ న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని. మౌనం పాటించడం జరిగింది. కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ కోట్ల భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రాజెక్టులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయంలో చేయడం జరిగింది ముఖ్యంగా మన హొళగుంద మండలం హగిరీ బ్రిడ్జి. హైస్కూలు. ఇంటింటి దీపం కరెంటు తెచ్చిన ఘనత ఆ మహానీయుడు కోట్ల భాస్కర్ రెడ్డిది. కార్యకర్తల సమావేశంలో అమానుల్లా మాట్లాడుతూ 2024లో ఇటు ఆంధ్రప్రదేశ్ లో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే దేశానికి వెన్నుముక లాంటి రైతులకు ఆరు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తారని అదే కాకుండా నిరుపేదలకు నెలకు 6000 ఆర్థిక సహాయం మరియు వితంతువులకు వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తారని. మన ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యంగా కావలసిన ప్రత్యేక హోదా పై మొదటి సంతకం చేస్తారని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది కావున మిత్రులారా రెండువేల 24 లో ఆలూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలూరు పీరా సాబ్. హెచ్చు పరసప్ప. ముస్తఫా. రాజు ఇస్మాయిల్. ఇజాజ్ సిద్దయ్య. మల్లయ్య. అస్లాం. నబి రసూల్. కురువ ఈరన్న.. మొదలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.