మానవత్వానికి మరో రూపం…సాయినాధుని సేవా గుణం
1 min readగేదలు మృతి చెందిన కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : కుటుంబ పోషణకు జీవనాధారమైన గేదెలు రైలు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందడంతో వాటి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబం కన్నీటి పర్యంతమైంది. కమలాపురం నియోజకవర్గం లో నిరుపేదల సేవకుడిగా పేదల ఆపద్బాంధవుడిగా పేరొందిన కమలాపురం నియోజకవర్గం ప్రజా సేవకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ తన వంతు బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి బుధవారం మధ్యాహ్నం పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబ యజమాని గోపులాపురం గంగిరెడ్డికి అందించారు. నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం మండలం సి గోకులాపురం గ్రామానికి చెందిన గంగిరెడ్డి కుటుంబం గేదలు పెట్టుకుని వాటి పాలు విక్రయించడం ద్వారా కుటుంబ పోషణ చేస్తుండేది. గంగిరెడ్డికి చెందిన గేదెలు మేత మేయడానికి పొలాల్లోకి వెళ్లే భాగంగా రైల్వే పట్టాలు దాటాల్సి ఉండడంతో గేదెలు రైలు పట్టాలు దాటు తుండగా వేగంగా వచ్చిన రైలు గేదెలను ఢీ కొనడంతో అక్కడికక్కడే గంగిరెడ్డి కి చెందిన నాలుగు గేదెలు ప్రాణాలు విడిచాయి. తమ కుటుంబ జీవనాధారమైన గేదెలు తమ కళ్ళ ఎదుట మృత్యువాత పడడంతో గంగిరెడ్డి కుటుంబం తల్లడిల్లి పోయింది. తమ జీవనాధారమైన గేదెలతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న గంగిరెడ్డి సతీమణి మీగడ తులశమ్మ కన్నీటి పర్యంతమై కుమిలి కుమిలి పోయింది. అయితే గంగిరెడ్డి కుటుంబ బాద అర్థం చేసుకున్న నాథుడే కరువయ్యారు. విషయాన్ని తెలుసుకున్న కమలాపురం నియోజకవర్గం ప్రజా సేవకుడు నిరుపేదల పక్షపాతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ బుధవారం నాడు గంగిరెడ్డి సంప్రదించి తనకు గేదెల ప్రమాద విషయం వెంటనే ఎందుకు చెప్పలేదని అడిగి గంగిరెడ్డిని ఓదార్చారు. తక్షణమే తన వంతు బాధ్యతా యుత సేవగా గంగిరెడ్డి కి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. పెద్దపుత్తకు చెందిన బాలిరెడ్డి సముద్రం పల్లె సుబ్బారెడ్డి తదితరులతో కలిసి గంగిరెడ్డి కి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గంగిరెడ్డి మాట్లాడుతూ తన బాధను గుర్తించి తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సాయినాథ్ శర్మ మనసున్న మహారాజు అని ఆయన కొనియాడారు.