అరుణాచల క్షేత్రంలో అన్నప్రసాద వితరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కమలాపురం : శ్రీ బాధ్రప్రద శుక్ల పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణానికి వచ్చే సకల భక్తాదులకు 28వ తారీఖు గురువారం రాత్రి 8గంటల నుంచి 29వ తారీఖు శుక్రవారం రాత్రి 11గంటల వరకు నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ మరియు శ్రీ జయ వారాహి పౌండేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ కాశీభట్ల సత్య సాయినాధ్ శర్మ తలపెట్టారు. శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం. శివునికి అంకితం చేయబడిన ముఖ్యమైన శైవ దేవాలయం అరుణాచల దేవాలయం. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న ఈ ఆలయం పంచభూత స్థలం. ప్రకృతి లోని అయిదు అంశాలకు అంకితం చేయబడిన ఐదు శివాలయాలకు చెందినది. అధిష్టానం అగ్నిలింగం (అగ్నిమూలకం) రూపంలో ఉంటుంది. అరుణాచలం అనగా అరుణ- ఎర్రని, అచలము- కొండ ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థము. అరుణాచలం చాలా గొప్ప పుణ్యక్షేత్రం. వేద, పురాణాలలో కొనియాడబడిన క్షేత్రము. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే శైవ క్షేత్రం అరణాచలం. అటువంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మరొక పుణ్యతీర్థం. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి దైవ సమానులైన శ్రీ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో 28వ తారీఖు గురువారం రాత్రి సుమారు 8,000 మందికి పొంగలి అన్న ప్రసాదం అందిస్తూ తెల్లవారుజాము వరకు 500 లీటర్ల బాదంపాలు వితరణగా సాయినాథుడు వితరణగా అందిస్తున్నాడు. 29వ తారీఖు మధ్యాహ్నం సుమారు 1200 మందికి పులిహోర మరియు పెరుగన్నం, సాయంత్రం 5గంటల నుండి ఉప్మా మరియు ఇడ్లీ అన్నప్రసాదాలను సుమారు 3,000 మందికి వితరణగా అందిస్తున్నారు. కావున భక్తాదులు ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవ్వాలని ప్రార్థన.. అంతేకాకుండా సేవలో పాల్గొన్న సభ్యులకు అదేరోజు సాయంత్రం అభిషేక దర్శనం చేయించి శ్రీ అరుణాచలేశ్వరుని ప్రసాదం అందజేసేందుకు ఏర్పాటు చేశారు.