PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ బీ కేలో ఖాళీ పోస్టుల భర్తికి దరఖాస్తుల స్వీకరణ

1 min read

– రైతు భరోసా కేంద్రంలో పని చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు, అసిస్టెంట్లు 822 అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన..

– ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్  లో శిక్షణ..

–రైతు భరోసా కేంద్రాల ద్వారా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధం..

– జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :   పౌరసరఫరాల సంస్థ  నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల (రైతు భరోసా కేంద్రం) వద్ద పనిచేయుటకు అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు భర్తీ చేయుటకు ఆన్ లైన్ లో 1364 ధరఖాస్తులను స్వీకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. బుధవారం ఏలూరులోని కలెక్టరేట్ కాంపౌండ్లో గల గోదావరి మీటింగ్ హాల్ నందు జిల్లా ఎంపిక కమిటీ చైర్మన్ & సంయుక్త కలెక్టర్, ఏలూరు వారి ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ సభ్యులు చేత దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిర్వహించబడింది. 270 టెక్నికల్ అసిస్టెంట్లకు గాను 232 మంది అభ్యర్ధులు, 270 డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గాను 637 మంది అభ్యర్ధులు, 421 హెల్పర్ పోస్టులకు గాను 495 అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారన్నారు.  ఈ సందర్బంగా 822 మంది ధరఖాస్తుదారులు పరిశీలన కార్యక్రమానికి హాజరయ్యారన్నారు.  గతంలో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఆర్బికేల ద్వారా ధాన్యం కొనుగోలులో  అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు కు కొంత శిక్షణ అవసరమని గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ మేరకు ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలులో ఇటువంటి లోపాలు తలెత్తకుండా జిల్లాలోని 261 ఆర్బికే కేంద్రాల్లో వీరిని నియమించేందుకు అవసరమైన సరైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ నెలాఖరులోపు వీరిని ఎంపిక చేసి అక్టోబరులో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్ధుల వివరాలను ఏలూరు జిల్లా అధికారిక వెబ్ సైట్ https://eluru.ap.gov.in/notice_category/recruitment/ నందు ప్రచురించడం ద్వారా గానీ లేదా ఎంపికైన అభ్యర్ధుల వ్యక్తిగత ఫోన్లకు సమాచారం తెలియజేయబడుతుందన్నారు.జిల్లాలో ఖరీఫ్ లో సుమారు 2 లక్షల పైబడి ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నారన్నారు.  ఇప్పటికే 70 శాతం ఈక్రాప్ నమోదు జరిగిందన్నారు.  ఖరీఫ్ లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగలదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలద్వారా సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

About Author