జిపిఎస్ పై ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదు.. ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: సిపిఎస్ ఉద్యోగులు 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటాల ఫలితంగా అనేక రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు కు చర్యలు తీసుకున్నారని, అయితే అన్ని రాష్ట్రాల కన్నా ముందు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు హామీనీ పక్కనపెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అన్ని వ్యతిరేకిస్తున్నా కూడా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి చే ఏపీ జిపిఎస్ బిల్లు 2023 పేరుతో ప్రవేశపెట్టి సిపిఎస్ స్థానంలో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్) అమలు చేయడానికి ఏక పక్షంగా ముందుకెళ్లడం ఏమాత్రం సరి కాదని, పైగా బిల్లులో అన్ని స్థాయిల్లో,అన్ని వర్గాలతో చర్చించామని కూడా తెలియజేసారని, ఇంతవరకు ఈ బిల్లులో ఏముందో కూడా తెలియనటువంటి స్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయులు, సంఘాలు ఉన్నాయని, ఇలాంటి తరుణంలో జిపిఎస్ అమలుకు ఏకపక్షంగా ముందుకు వెళ్లడం మానుకోవాలని పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని,అలాగే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను రెగ్యులర్ చేసి ఉపాధ్యాయులకు జే ఎల్ పదోన్నతులు లేకుండా చేయడంవల్ల ఉపాధ్యాయులు ఎంతగానో నష్టపోతున్నారని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణకుమార్, ప్రధాన కార్యదర్శి యస్.బాలాజీ లు ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.