భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
1 min readముంబయి: శుక్రవారం భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో …బ్యాంక్ నిఫ్టీ దాదాపు 1000 పాయింట్ల గ్యాప్ డౌన్ తో ప్రారంభమైంది. అనంతరం డౌన్ సైడ్ దిశగా ఇండెక్స్ లు కదులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నెలకొన్న పరిణామాలతో ఈ రోజు మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధానంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. అన్ని రంగాల్లో కూడ మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ఫలాన రంగం అనే బేధం లేకుండా అన్ని స్టాక్స్ కూడ రెడ్ జోన్ లో ప్రస్తుతం పయనిస్తున్నాయి.