సత్య ధర్మాలు జీవితానికి శోభనిస్తాయి…
1 min read– అసత్య అధర్మాలు జీవితానికి క్షోభనిస్తాయి
– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సత్య ధర్మాలు జీవితానికి శోభనిస్తాయని, అలాగే అసత్య అధర్మాలు జీవితానికి క్షోభను కలిగిస్తాయని ఈ సత్యాన్నే సకల శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు మండలం, వెంగళరెడ్డి పేట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భారతీయ సంస్కృతి వైభవాన్ని గురించి సోదాహరణంగా వివరించారు. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై యం.మద్దయ్య స్వామి ధార్మిక ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లె సోమశేఖర రెడ్డి నాగమని, అర్చకులు జి.సదాశివరావు, దేవేందర్ రెడ్డి, చిన్న వెంకట సుబ్బారెడ్డి, పల్లె సుధాకర్ రెడ్డి, పెద్ద బాల వెంకటరెడ్డి, చిన్న బాల వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, అంకాల్ రెడ్డి, కృష్ణవేణి, నాగమణి, రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవి, మద్దిలేటి, సాంబశివుడు , నాగలక్ష్మి , దస్తగిరమ్మ, కొప్పుల శివరామిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.