జీజీహెచ్ వైద్యశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం భాగంగా ఈరోజు గౌరవ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా.సంజీవ్ కుమార్ వచ్చి సందర్శించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి ఆరా తీశారు అనంతరం ఆసుపత్రిలోని 24 ల్యాబ్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా పలు వైద్య పరీక్షలు చేసుకున్నట్లు తెలిపారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా.సంజీవ్ కుమార్ మాట్లాడుతూ: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 1) బిపి టెస్ట్ 2) షుగర్ టెస్ట్ 3) హిమోగ్లోబిన్ టెస్ట్ 4) మూత్ర టెస్ట్ 5) మలేరియా టెస్ట్ 6) డెంగ్యూ టెస్ట్ 7) చార్కోల్ టెస్ట్ లు చేపించుకున్నట్లు తెలిపారు.ఇటువంటి కార్యక్రమం ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం శుభ పరిణామం. దీనికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి అని తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం భాగంగా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమైనది.ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రి కంటే మెరుగైన వైద్య పరికరాలు ఉన్నాయని తెలియజేశారు.ఆసుపత్రిలో ప్రొఫెసర్స్ మరియు సీనియర్ వైద్యులు, గోల్డ్ మెడలిస్ట్ లు ఉన్నారు ఇక్కడ అందిస్తున్న వైద్య సేవలు మరెక్కడ దొరకవు అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్, డా.సుధాకర్, బయో కెమిస్ట్రీ హెచ్ఓడి, డా.పద్మ విజయ్ శ్రీ, మెడికల్ HOD డా.ఇక్బాల్ హుస్సేన్, RMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగంజన్, డా.కిరణ్ కుమార్, డా సునీల్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.