అన్నం పరబ్రహ్మ స్వరూపం…
1 min read– అన్ని దానాల్లో కన్నా అన్నదాననికి మరొకటి సాటి రాదు..
– పూర్వికుల సాంప్రదాయం నేటికీ కొనసాగడం ఆనందదాయకం..
– జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక ఏలూరు అమీనా పేట పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల అభయాంజనేయ స్వామి గుడి ప్రక్కన గల శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వినాయక నవరాత్రులను ఘనముగా నిర్వహించినారు. బుధవారం నాడు సిద్ధి వినాయక దేవాలయం ప్రాంగణంలో భక్తులకు మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయముగా ప్రజలకు అన్నము వడ్డించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఆకలి అన్ని వర్ణాలు వారికి అన్ని మతాల వారికి అన్ని వర్గాల వారికి ఒకటేనని గ్రహించిన మన పూర్వీకులు పండుగ పర్వదినాలను పురస్కరించుకుని దైవ కార్యక్రమాలకు అన్న సమారాధన కార్యక్రమలు నిర్వహించేవారిని,ఇదే విధముగా మనకు తెలియచేసిన దానిపై మనము మన భావితరాల వారికి కూడా ఈ ఆచరణను. పండగల విశిష్టతలను సాంప్రదాయాలను తెలియజేస్తూ ఐక్యమత్యంగా అన్న సమారాధన చేయడం వలన మనిషిలో మానవతా విలువలు మరింత బలపడి కలసి మెలిసి ఉంటామన్నారు. అన్నదానాలకి మించినది మరొకటి సాటి రాదని జిల్లా ఎస్పీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శేఖర్ ఏలూరు డిఎస్పి ఇ. శ్రీనివాసులు ,ఎస్.బి ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ,ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఏ.అర్. అర్.ఐ పవన్ కుమార్, అర్.ఎస్. ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.