అన్నార్తుల ఆకలి తీర్చిన ఆపద్బాంధవుడు ఎంఎస్.. స్వామినాథన్
1 min read
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: దేశంలోని అన్నార్తుల ఆకలిని తీర్చిన ఆపద్బాంధవుడు హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య అన్నారు. ఎంఎస్ స్వామినాథన్ మరణం చాలా బాధాకరం అని, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తికొండ స్థానిక చదువులు రామయ్య భవన్ నందు శుక్రవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన వరి గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ జరిపిన విశేష కృషితో దేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించారని తెలిపారు. 1960 నాటి కరువు పరిస్థితులను ఎమ్మెస్ స్వామినాథన్ కృషి వల్లనే దేశం ఎదురుకోగలిగిందని అన్నారు. ఆకలి లేని భారతదేశమే నా కల అంటూ 19 88లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ను కూడా స్థాపించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమం రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఎం కారన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు భీమ్ లింగప్ప, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నబి రసూల్, మద్దిలేటి శెట్టి, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి పెద్ద ఈరన్న, సిపిఐ టౌన్ పార్టీ కార్యదర్శి ఎన్ రామాంజనేయులు, కౌలు రైతు సంఘం నాయకులు జై కాశీం, ప్రజా సంఘాల నాయకులు మాదన్న, నరసింహులు, వెంకటరామిరెడ్డి, లక్ష్మన్న, జగదీష్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.