జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు..
1 min read– వేలాదిమందికి అన్న సమారాధన..
– సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు..
– ఉత్సవ కమిటీ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : అగ్రహారం శ్రీ రామ కోటి ప్రాంగణంలో శ్రీ గణపతి త్రయోదశి నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 18 వ తేదీ సోమవారం నుండి27 స్థిర వారం వరకు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పట్టణానికి కి చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ సామర్ల కిరణ్ కుమార్ (నాని) వైస్ ప్రెసిడెంట్ వీరమాచినేని చంద్రశేఖర్ (చందు) సెక్రటరీ ఎడవల్లి సుబ్బారావు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అగ్రహారం రామకోటి ప్రాంగణ ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర భారీ అన్న సమారాధన జరిగింది. ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు పలువురు మహిళలు అన్న సమారాధన కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అక్కడికి వచ్చిన భక్తులు ముందుగా గణేష్ ని పూజించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ అన్న సమారాధన లో మండపానికి నలువైపులా భక్తులు సౌకర్యార్థం ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా కోశాధికారి సేనాపతి జయకృష్ణ , జనరల్ సెక్రెటరీ ముక్తాల దుర్గేష్, నగేష్ ఆర్గనైజర్ చెరుకు తోట అనిల్ లు భోజనం ఏర్పాట్లు చేయడంలోనూ భక్తులకు అందించడంలోనూ ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు. మరికొంతమంది ఉచ్చావ్ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీరు తోపాటు వృద్ధులు, వికలాంగులకు భోజనం నిర్వహించడం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వీట్ మ్యాజిక్ వారి సహకారంతో 108 కేజీల లడ్డు వేలం పాటలో భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఉత్సవ్ కమిటీ విగ్రహాన్ని చెoడా మేడం( కేరళ డ్రమ్స్) వాయిద్యాలతో ప్రారంభమై డీజే బ్యాండ్ మేళాలతోనూ శక్తి, చిత్ర విచిత్ర వేషధారణలతోనూ డీజే సౌండ్లతోనూ భక్తుల ఆనందోత్సవాల మధ్య పెద్ద పోస్ట్ ఆఫీస్ మీదుగా గడియార స్తంభం, గోల్డ్ మర్చంట్ మార్గం నుండి ఏలూరు కృష్ణ కాలువలో గణేష్ నిమజ్జనం జరిగింది. విచ్చేసిన భక్తులకు ఎక్కడ ఏ అసౌకర్యం కలుగ కుండా కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సహకరించిన యూత్ సభ్యులకు, పోలీసు వారికి, అధికారులకు, అనధికారులకు, పెద్దలకు, సహకారం అందించిన దాతలకు, పేరుపేరునా కృతజ్ఞతలు నిర్వాహకులు తెలియజేశారు.