ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కి అదనపు బాధ్యతలు
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ నూతన డైరెక్టర్ సెక్రటరీగా మైనారిటీస్ కమిషనర్ ఆఫీస్ నందు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న షేక్ మస్తాన్ వలి కి అదనపు విధులను అప్పగిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కావున డైరెక్టర్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అందరూ బాధ్యతాయుతముగా పనిచేస్తూ ఉర్దూ అకాడమీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తరువాత సెక్రెటరీ టు గవర్నమెంట్ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎండి ఇంతియాజ్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీయూనియన్ సభ్యులు పాల్గొని మస్తాన్ వలీ కి అభినందనలు తెలియజేశారు.