NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో 15 వేల రూ. నగదు బహుమతి..

1 min read

– శనివారం పేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు..

– జిల్లా కలెక్టర్ చే  ప్రశంసలు..

– ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులకు అభినందనలు..

– పాల్గొన్న డీఈవో శ్యామ్ సుందర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  జాతీయ స్ధాయిలో షూటింగ్ బాల్ పోటీలో పాల్గొన్న మరియా జోషిను, వ్యాస రచనలో రాష్ట్రస్ధాయిలో 15 వేల రూపాయలు నగదు బహుమతి అందుకున్న తరుణ్, చరణ్, మహేష్ లను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అభినందించారు.   శనివారపుపేట జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్ధులు శనివారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.  విజేతలతో ముచ్ఛటించి వారిలో మరింత స్పూర్తిని కలెక్టర్ నింపారు.  జిల్లా స్ధాయిలో ఆరోగ్య శాఖ నిర్వహించిన క్విజ్ పోటీలో ప్రధమబహుమతి అందుకున్న వైష్ణవి, తనూషలను కలెక్టర్ అభినందించారు.  డ్రాయింగ్ పోటీల్లో విశేష ప్రతిభను కనపరుస్తున్న ఎతికరిమి ప్రత్యూషలను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ్ సుందర్, పాఠశాల ప్రదానోపాధ్యాయుడు జి.ప్రకాష్ , ఉపాధ్యాయులు రాజ్ కుమార్, ఇర్షద్ అహ్మద్, ఉమామహేశ్వరీ, జయసుభ, పలువురు విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

About Author