మరణించిన టిడిపి కార్యకర్త కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం..
1 min read– అధైర్య పడవద్దు పార్టీ అండగా ఉంటుంది..
– సొంగ రోషన్ కుమార్ భరోసా..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : శనివారం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తెలుగు దేశం కార్యకర్త పులపాకుల రాజశేఖర్ మరణించడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ లో వారి మృతదేహాన్ని చూసి సొంగ రోషన్ కుమార్ చెలిoచి పోయారు. తాత్కాలిక ఖర్చుల నిమిత్తం ఒక పదివేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట రాష్ట్ర అధికార ప్రతినిధి శేషు, మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జిల్లా పార్టీ కార్యదర్శి బొబ్బర రాజు పాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరొక్కసారి కుటుంబాన్ని సందర్శిస్తామని, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, నాయకులు అండగా ఉంటుందని అధైర్యపడవద్దని రోషన్ కుమార్ భరోసాని ఇచ్చారు.