‘అశోక ఉమెన్స్’లో.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన
1 min readవిద్యార్థులకు అవగాహన కల్పించిన కిమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. పృద్వీరాజ్
పల్లెవెలుగు: మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు కిమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. పృద్వీరాజ్. శనివారం కర్నూలు నగరంలో అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల నందు అశోక్ వర్ధన్ రెడ్డి ,చైర్మన్ మరియు కిమ్స్ హాస్పిటల్, కర్నూల్ కి చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ పృధ్వీ రాజ్, సర్జికల్ oncologly మరియు డాక్టర్ M. రవి క్రిష్ణ, మెడికల్ oncologly, ఆధ్వర్యంలో దాదాపు 400 మంది మహిళా విద్యార్థుల కు బ్రెస్ట్ కాన్సెర్ మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాట్లాడుతూ కాన్సెర్ ఏ విధంగా వస్తుంది మరియు దీనిమీద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు అదేవిధంగా ఈ ఇవాళ సమాజంలో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ఈ క్యాన్సర్లు కూడా అనేక రకాలుగ ఉన్నాయి మరియు అనేక రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ప్రధానంగా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం మహిళలు దాన్ని ప్రారంభంలోనే దాని యొక్క లక్షణాలను తెలుసుకుని దీని మీద డాక్టర్ గారు సలహాలు సూచనలు పాటిస్తే నివారణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ ఆనంద్ కుమార్ మరియు కే.మ్.బాషా మాట్లాడుతూ మహిళలు ఈ సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అటువంటి మహిళలకు సేవలందించడానికి ఎల్లవేళలా మేము ముందుంటామని తెలియజేస్తు కర్నూల్ కిమ్స్ హాస్పిటల్ లో ప్రతి శక్రవారం, శనివారం, ఆదివారం కాన్సెర్ సేవలు మీ అందుబాటులో ఉంటాయనిఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజర్ ఆనంద్ కుమార్ వెల్లడించారు.