మత్స్యకారులకు..టీడీపీ అండగా ఉంటుంది: టి.జి భరత్
1 min read– టి.జి భరత్ ను కలిసిన కర్నూలు సిటీ మత్సకార సంక్షేమ సంఘం నేతలు
- వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుకు కృషి చేస్తామన్న మత్స్యకారులు
పల్లెవెలుగు: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ హామీ ఇచ్చారు. కర్నూలు సిటీ మత్సకార సంక్షేమ సంఘం నేతలు మౌర్య ఇన్ లో టి.జి భరత్ ను కలిశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో ద్వారా తమకు తీరని అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా వారు టిజి భరత్ తో మొరపెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ తమకు మద్దతుగా వచ్చిన మత్స్య కారులకు ధన్యావాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఆలోచించే నాయకుడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మత్స్యకారులకు మంచి జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. మత్స్యకారుల ఇబ్బందులను పార్టీ అధిష్టానంకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలులో తాను గెలవగానే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తానని చెప్పారు. మత్స్యకార యువతకు కూడా స్థానికంగా ఉద్యోగాలు లభించేలా పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ కర్నూలు సిటీ మత్సకార సంక్షేమ సంఘం కర్నూలు సిటీ గౌరవ సలహాదారులు రిటైర్డ్ ఎమ్మార్వో రామన్న , బ్యాంకు లక్ష్మన్న (తెలుగేరి), నగర అధ్యక్షులు ఆనంద్ రాజ్ బాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కదిరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ జలగరి వెంకటేశ్వర్లు, వెంకట శివ, ప్రధాన కార్యదర్శి నాగ రమణ, జాయింట్ సెక్రెటరీ టీకయ్య, సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు, ఈసీ మెంబర్స్ జలగరి రమణ, పాములేటి, గవర్నమెంట్ ప్రెస్ శ్రీనివాసులు , మధు, అంజి, చందు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.