NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న  జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించినట్లు తెలిపారు.జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళిఆసుపత్రిలోని నర్సింగ్ సిబ్బంది అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి అనంతరం చిన్నపిల్లల విభాగంలోని పేషెంట్స్ కు పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఆసుపత్రి ఆవరణలో  స్వచ్ఛభారత్ ప్రోగ్రాంను వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందితో కలసి ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛందంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న పీజీ హాస్టల్స్  డాక్టర్స్ మరియు ఇతర సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ CSRMO, డా.హేమమాలిని, RMO డా.వెంకటరమణ, వైద్యధ్యాపకులు డా.విద్యాసాగర్, డా.మహేశ్వర్ రెడ్డి, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగంజన్, డా.కిరణ్ కుమార్, డా.సునీల్ ప్రశాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్, శ్రీమతి.వెంకట తులసమ్మ, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  తెలిపారు.

About Author