NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్థానిక శాంతి టాలెంట్ స్కూల్ లో మహాత్మా గాంధీ, మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతివేడుకలు స్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయ లక్ష్మి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.మొదట  వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివళులర్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ, గాంధీజీ అనుసరించి న అహింసా మార్గం, సత్యాన్వేషణ ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన హితవు పలికారు. సత్యా గ్రహమే ఆయుధంగా అహింసామార్గం లో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్చా స్వాతంత్ర్యాన్ని అందించిన గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి అడుగుగు జాడలలో ప్రతి ఒక్కరూ వారిని స్మరిస్తూ,వారి మార్గంలో  పయనించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు నాగరాజు,రహంతుల్లా, హమీద్, మహబూబి,విజయ భారతి,ఈశ్వరి, శాంతి, షమీ మ్ పాల్గొన్నారు.

About Author