గాంధీజీ మార్గం- ఎందరికో ఆదర్శనీయం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మహాత్మా గాంధీ జి మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని ఆయన చూపిన మార్గంలో పయనించాలని, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, లు అన్నారు, సోమవారం వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో మహాత్మా గాంధీ ఏంటి ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడమే కాకుండా, సమాజంలో ఎలా జీవించాలి, సాటి మనిషికి మనం ఎలా తోడ్పాటు ఇవ్వాలి వంటి విశేషాలు ఎన్నో తెలియజేయడం జరిగిందన్నారు, ఆయన సందేశాలు మానవ జీవితాలకు మరింత పాటలు వేసే విధంగా ఉన్నాయని తెలిపారు, ఇందులో ఆయన చెప్పినట్లు మనం రేపే చివరి రోజు అన్నట్టుగా జీవించాలని, రేపు కూడా జీవించాలని దృక్పథంతో నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని గాంధీజీ తెలిపినట్లు వారు తెలిపారు, అలాగే కన్నుకు కన్ను అనే సిద్ధాంతం ప్రపంచాన్నే గుడ్డిగా మారుస్తుందని అలాంటి వాదన మంచి సంస్కృతి కాదని ఆయన తెలియజేసినట్లు తెలిపారు, మనం బ్రతికినన్నాళ్లు ఎంత గొప్పగా బ్రతికామన్నది, తర్వాత నలుగురు గొప్పగా చెప్పే విధంగా బ్రతకాలని, అలా కాకుండా జీవించడం ఆ జీవితమే వ్యర్థమన్నారు, మన అంతరాత్మ తప్పు అని చెప్పినప్పుడు ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనాల కొరకో, ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికమని గాంధీజీ పేర్కొనడం జరిగిందని ఆయన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సాధక్ అలీ, చంద్ర, వైయస్సార్ సిపి నాయకులు టిఎన్ చంద్రారెడ్డి, శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.