జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉంటేనే రక్షణ..
1 min read– మీడియా రంగంలోను ఇబ్బందులు..
– సేవ్ జర్నలిజం కార్యక్రమంలో పలువురు అభిప్రాయాలు
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి : పత్రిక రంగాన్ని రక్షించుకోవాలన్నా ఈ వృత్తిలోనీ విలేకరులకు రక్షణ కావాలన్న ముందు ఐక్యత అవసరమని ఎపియుడబ్ల్యుజే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జేవిఎస్ఎన్ రాజు అన్నారు. భీమవరం ఆంకాల ఆర్ట్స్ అకాడమీలో జరిగిన సేవ్ జర్నలిజం దినోత్సవాన్ని నిర్వహించారు. రాజు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వ విధానాల వల్ల మీడియా రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని, వృత్తి పరంగా దాడులు, కేసులు పెడుతున్నారని, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీడియా రంగం బలహీన పడుతుందన్నారు. ఉమ్మడి జిల్లా సెక్రటరీ వీఎస్ సాయిబాబా మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని, పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సీనియర్ విలేకరి ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల భీమవరంలో కొందరి విలేకరులపై పెట్టిన కేసులపై చర్చలు జరగాలని అన్నారు. పలువురు విలేకరులు పలు సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో నిమ్మల ఆది, బోణం శ్రీనివాస్, యర్రంశెట్టి గిరిజపతి, వంగల లింగమూర్తి, బి శివవర్మ, ఆదిత్య బబీ, హనుమంత్ రావు, వెంకటేష్, మహేష్, జి.ప్రసన్నకుమార్, తాళ్లూరి జయ కుమార్, సుదర్శన్, బి రాజు, రాజశేఖర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.