బి.జె.పి కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రతిఘటించండి
1 min read– ఏఐటియుసి సిఐటియు- ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘాలు (AIKS)పిలుపు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖీరిలో రైతులుపై జరిగిన ఘటనకు నిరసనగా అలాగే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ యూనియన్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎస్, ఏ ఐ టి యు సి, సి ఐ టి యు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ కూడలి నందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య రైతు సంఘం జిల్లా నాయకులు రంగారెడ్డి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లోని లక్కింపూర్ ఖీరీలో 2021 అక్టోబర్ మూడున నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నిర్లక్ష్యంగా అతి దారుణంగా కాన్వాయ్ తో తొక్కించి చంపడం జరిగిందన్నారు. ఈ ఘటనకు కారణమైన హంతకుడు ఆశిష్ మిశ్రా ను నరేంద్ర మోడీ ప్రభుత్వం శిక్షించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కేసు విచారణ నత్త నడకగా కొనసాగిస్తున్నదని, రైతు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను తొక్కించిన ఆశిష్మిత్ర తండ్రి మంత్రి అజయ్ మిత్రాను మంత్రి పదవి నుండి తొలగించి రైతుల హత్యకు కారణమైన హంతకుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. కేంద్రప్రభుత్వంరైతులకు ఉన్న అప్పులన్నీ రద్దుచేసి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు.దేశంలో,రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపై WFTU వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 3న ప్రపంచ కార్మికుల హక్కులపై మన దేశంతో సహా అనేక అనేక దేశాల్లో పాలక వర్గాలు దాడులు చేస్తున్నాయని అన్నారు.