NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

21 వ రోజు కొనసాగిన టిడిపి రిలే నిరాహార దీక్షలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్  ఆధ్వర్యంలో  21 వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రిలేనిరహర దీక్షలను ప్రారంభిస్తూ, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్  రిమాండ్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులు ఖండిస్తూ, బాబు గారికి తోడుగా… ఒక్క నియంతపై  పోరాటం కోసం మేము సైతం అంటూ స్థానిక నాలుగు స్తంబాల కూడలి లో మంగళవారం పందికొన గ్రామ ప్రజలు మోకాళ్లపై నిల్చొని కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం రిలే నిరాహార దీక్షలో 21 వరోజు  పందికొన గ్రామ ప్రజలు రీలే నిరాహారదీక్ష శిబిరం వద్ద  దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావం తెలుపుతూ దీక్షలలో కూర్చున్నారు. పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ  ముఖ్య నాయకులు రామానాయుడు తిరుపాడు అశోక్ కుమార్ మనోహర్ చౌదరి లక్ష్మీనారాయణ చౌదరి శ్రీధర్ రెడ్డి సింగం శ్రీనివాసులు మీరా హుస్సేన్ శ్రీనివాసులు గౌడ్ కార్యకర్తలు మరియు సీపీఐ ముఖ్య నాయకులు రాజా సాహెబ్ నబి రసూల్ కారుమంచి  మరియు జనసేన నాయకులు సిజి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author