ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
1 min read– ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల : ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలోనే ఉంటాయని, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి ఆటో డ్రైవర్లకు సూచించారు. ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ఆదేశాల మేరకు బుధవారం గోనెగండ్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, పరిమితికి మించి ఆటో ఎక్కించుకోరాదని, డ్రైవర్లు యూనిఫామ్ కచ్చితంగా వేసుకోవాలని సూచించారు. రోడ్లపై ఆటోలను ఇష్టానుసారంగా నిలుపరాదని, ప్రయాణికుల కోసం రోడ్డు పక్కకు ఆటోను తీసుకెళ్లాలన్నారు. అన్ని నియమాలు తెలిసినా.. కొందరు ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే వ్యవహార శైలి మార్చుకొని ట్రాఫిక్కు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి కోరారు.