నవంబర్ 5వ తేది నాటికి (FLC) ప్రక్రియను పూర్తి చేయాలి
1 min read– ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెక్ (FLC) ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
– జిల్లా కలెక్ట ర్ డా.జి. సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెక్ (FLC) ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్ట ర్ డా.జి. సృజన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కు వివరించారు. విజయవాడ నుండి మంగళవారం ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెక్, ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం – 2024 కు సంబంధించి రాజకీయ పార్టీలు సమర్పించిన క్లెయిమ్లు & అభ్యంతరాలు, చనిపోయిన, డూప్లికేట్, బదిలీ చేయబడిన, నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్, ఎపిక్ కార్డ్ జనరేషన్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఫస్ట్ లెవెల్ చెక్ (FLC) ప్రక్రియను అక్టోబరు 16వ తేదిన ప్రారంభించి, నవంబర్ 5వ తేది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ లను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన ఫస్ట్ లెవెల్ చెక్ (FLC) ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు..బెల్ ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు..జిల్లాకు 7020 బ్యాలెట్ యూనిట్లు, 5460 కంట్రోల్ యూనిట్లు వచ్చాయని, వాటి స్కానింగ్ ప్రకియ జరుగుతోందన్నారు. వివిపాట్స్ కు సంబంధించి స్కానింగ్, యాక్సెప్టెన్స్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు..రాజకీయ పార్టీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరుగుతోందన్నారు.. ఫార్మ్-6 కు సంబంధించి 69వేల వరకు రాగా వాటిలో ఇంకా 1064 పెండింగ్ ఉన్నాయని, ఫార్మ్-7 కు సంబంధించి 7,692 పెండింగ్ ఉన్నాయని, ఫార్మ్-8 కు సంబంధించి 2,247 ఉన్నాయని, వీటన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించి, డాక్యుమెంటేషన్ చేయడం జరిగిందని, కేవలం ఎలెక్ట్రోల్ రోల్ లో అప్డేషన్ మాత్రమే పెండింగ్ ఉందని కలెక్టర్ వివరించారు.. ఇంటింటి సర్వే లో భాగంగా అనమోలీస్, జంక్ క్యారెక్టర్స్, పది మంది కంటే ఎక్కువగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి పరిశీలించడం జరుగుతోందని కలెక్టర్ సీఈవో కు వివరించారు.కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ కె.మధుసూదన్ రావు, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, ఈఆర్ఓ మల్లిఖార్జునుడు, రమ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.