చెట్లను పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం
1 min read-సెయింట్ ఆన్స్ ఆధ్వర్యంలో అవగాహన
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రొవిన్సియల్ సుపీరియర్ సిస్టర్ శౌరీలు అన్నారు.కర్నూలు మండల పరిధిలోని జోహారాపురం గ్రామంలో ఉన్న సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు గ్రామ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించారు.సెయింట్ ఆన్స్ సిస్టర్ శౌరీలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ పేపర్లు కవర్లు వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ కవర్లు వాడటం వల్ల నష్టాల గురించి వివరించారు.ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఐక్యమత్యంతో సోదర భావంతో జీవించాలని ప్రతి ఇంటి ముందు చెట్టును పెంచుకోవాలని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు.ప్రతి ఇంటింటా చెట్లను పెంచుదాం- పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం అనే వాటి పైన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు,నాటక ప్రదర్శన ద్వారా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ థెరిస్సా, ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతి,సిస్టర్లు అన్నమ్మ,పావని,ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.