PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే సీఎం జగన్ లక్ష్యం…

1 min read

– సంక్షేమం, సుపరిపాలన, అభివృద్దే  ప్రభుత్వ  ధ్యేయం.

ఎమ్మెల్యే తొగురు ఆర్థర్.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. మంగళవారం మండలం లోని బొల్లవరం గ్రామంలో  ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని  ఎమ్మెల్యే ఆర్థర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.దేశానికే ఆద‌ర్శం జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌  కార్యక్రమమని పేర్కొన్నారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా, రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్య వివ‌రాల‌ను న‌మోదు చేసి, అవ‌స‌ర‌మైన వారంద‌రికీ వైద్యం అందించ‌డం ఈ అద్భుత‌ కార్య‌క్ర‌మం ల‌క్ష్య‌మ‌న్నారు. జ‌గ‌నన్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్ర‌మం ద్వారా ఆరోగ్య, వైద్య‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, మందుల‌ను ఉచితంగా అంద‌జేయడం జరుగుతుందని తెలిపారు.  దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఇంటివ‌ద్ద‌కే వైద్యాన్ని అందించేందుకు ఈ వినూత్న కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించార‌ని చెప్పారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానం ద్వారా ఇప్ప‌టికే వైద్యాన్ని ప్ర‌జ‌ల‌ వ‌ద్ద‌కు చేర్చిన ముఖ్య‌మంత్రి, ఆరోగ్య సుర‌క్ష ద్వారా స్పెష‌లిస్టు సేవ‌ల‌ను సైతం గ్రామాల్లోకి తెచ్చార‌ని అన్నారు. డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆరోగ్య శ్రీ, 108 ద్వారా వైద్యాన్ని పేద‌ ప్ర‌జ‌ల‌కు అందిస్తే, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి దానిని మ‌రింత చేరువ చేర్చార‌ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరం జయలక్ష్మమ్మ , ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి, తహశీల్దార్ రాజశేఖర్ బాబు, ఎంపీడీఓ శోభారాణి, జిల్లా ఆరోగ్య శాఖ ఉప అధికారి శారద,  రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ శుకూర్ , వైసీపీ జిల్లా కారదర్శి డాక్టర్.వనజ  , మాజీ సింగిల్ విండో అద్యక్షులు మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , నందికొట్కూరు మండల నాయకులు ఉండవల్లి ధర్మారెడ్డి , వైసిపి జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు  షేక్ ఇనాయతుల్లా , వీరం రాఘవరెడ్డి, కాంతా రెడ్డి, నాగభూషణం రెడ్డి, శ్రీనివాసులు, రత్నం, ఆరే. వేంకటేశ్వర్లు , డాక్టర్ సుబ్రహ్మణ్యం ,  ఐసిడిఎస్ సూపర్ వైజర్ అనురాధ, వైసీపీ నాయకులు తమ్మడిపల్లి విక్టర్ ,పేరుమాళ్ళ జాన్, మల్యాల శంకరయ్య, శాతనకోట వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది, వైసిపి నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

About Author