మాదేపల్లి గ్రామ పంచాయితీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం..
1 min read– రోగులకు అందుతున్న సేవలను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలన..
– ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి..
– ఎమ్మెల్యే కొటారు అబ్బాయ్యా చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : దెందులూరు నియోజకవర్గం ఏలూరు మండలం మాదేపల్లి లోజరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరానికి ముఖ్యఅతిథిగా దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొటారు అబ్బాయ చౌదరి సందర్శించి పలువురు పేషెంట్లతో డాక్టర్లతో మాట్లాడారు. ప్రజలకు అందిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష పరీక్షలను, సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటువంటి ఉచిత క్యాంపులలో నిర్వహించే ఆరోగ్య పరీక్షలను నియోజకవర్గం ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమానికి ఏలూరు ఎంపీపీ పెన్మచ్చ శ్రీనివాసరాజు, సర్పంచ్ ప్రభుదేవా మరియు ఉప సర్పంచ్, ఎంపీడీవో బి ప్రణవి, సహకార బ్యాంకు చైర్మన్ బొల్లు ముంత శ్రీనివాసరావు, కార్యదర్శి వై సుమలత, పలువురు వైసిపి నాయకులు సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు నిదర్శనం అన్నారు. ఉదయం 9 గంటల నుంచి గ్రామంలోని సచివాలయ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్లు ప్రజలకు అవసరమైన చికిత్సలు చేస్తూ మందులు ఉచితంగా పంపిణీ చేశారు.