కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం పరిరక్షణ మన బాధ్యత
1 min read– ఎకో సెన్సిటివ్ జోన్(ఇఎస్ జెడ్) సరిహద్దుల నిర్వహణ..
– గ్రామ సభలు నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి..
– ఇఎస్ జెడ్ సంబంధించిన కమిటీ తొలి సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు దిశా, నిర్ధేశంచేసిన..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం కోసం ఎకో సెన్సిటివ్ జోన్(ఇఎస్ జెడ్) సరిహద్దుల నిర్ధారణ కోసం సమగ్రమైన ప్రతిపాధనలు సిద్దం చేసేందుకు కార్యాచరణ రూపొందించేందుకు సంబంధిత శాఖల వారీ నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎకో సెన్సిటివ్ జోన్ కు ప్రతిపాధనలు సిద్దం చేసేందుకు నియామకమైన కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఈ ఎస్ జెడ్ కు సంబందించిన పరిగణ లోనికి తీసుకోవలసిన వివిధ అంశాలను వన్య ప్రాణి విభాగం డిఎఫ్ వో ఎస్.రవిశంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇఎస్ జెడ్ సరిహద్దుల ప్రాదమిక లక్ష్యం కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ కొన్ని కార్యకలాపాను నియంత్రించడం తద్వారా రక్షిత ప్రాంతాన్ని ఆవరించియున్న పర్యావరణ వ్యవస్ధ కార్యకలాపాలయొక్క ప్రతికూల ప్రతిభావాలను తగ్గించడమన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశా, నిర్దేశం చేస్తూ ఈవిషయంపై వన్యప్రాణి విభాగం డిఎఫ్ఓ వారు కోరిన విధంగా ఆయా లైన్ డిపార్డ్ మెంట్స్ నిర్ధేశిత సమాచారాన్ని అందించి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతతో కూడిందని ఆయన స్పష్టం చేశారు. కొల్లేరులోని వెట్ ల్యాండ్, వన్యప్రాణుల అభయారణ్యం సంబంధించి ఎకో సెన్సిటివ్ బఫర్ జోన్ నిర్ధారించే ముందు సంబంధిత గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సమన్వయంతో మండల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు ఏలూరు ఆర్డిఓ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారన్నారు. గ్రామ సభలు నిర్వహించేందుకు 14 రోజులుముందు నోటీసులు జారీ చేయడంతోపాటు ఆ గ్రామంలో ఏ తేదీన నిర్వహించేది నోటీసు ప్రదర్శించాలన్నారు. సంబంధిత గ్రామాలు గుర్తించిగ్రామ సభలషెడ్యులును రూపొందించాలన్నారు. గ్రామ సభ నిర్వహణకు ఎస్ ఓపి తయారు చేసుకోవాలన్నారు. గ్రామ సభలోవచ్చే సలహాలు, అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. వీటన్నింటితోపాటు సంబంధిత శాఖల అధికారులు సమర్పించిన నివేదికలతో తదుపరి సమావేశంలో సమీక్షించి తుది ప్రతిపాధనలు సిద్దం చేయాలన్నారు. విజయవాడ నుంచి వచ్చే బుడమేరు కొల్లేరులో కలిసే మార్గంలో ఎక్కడైతే డ్రైన్ తక్కువ వెడల్పు ఉంటుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ క్రస్ట్ లు ఏర్పాటు చేసి చెత్తను రోజువారీగా తొలగించే ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. ఆ ప్రాంతంలో రెండు, మూడు ఎకరాల విస్త్రీర్ణం ఉండే భూములు గుర్తించి అక్కడ చెత్తను విభజించే ప్రక్రియను చేపట్టి ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు చర్యలుతీసుకోవాలని సూచించారు. సమావేశంలో టెరిటోరియల్ డిఎఫ్ఓ రవీంధర్ ధామ, వన్యప్రాణుల విభాగం డిఎఫ్ఓ ఎస్. రవిశంకర్, ఏలూరు ఆర్డిఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి, ఇరిగేషన్ ఎస్ ఇ కె. శ్రీనివాసరావు, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, కాలుష్యనియంత్రణమండలి ఇఇ వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం పి. యేసుదాసు, మత్స్యశాఖఇన్ ఛార్జి జెడి జివివి సత్యనారాయణ, డివిజనల్ పంచాయితీ అధికారి చంద్రశేఖర్, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, ఆర్ అండ్ బి ఎస్ ఇ జి. జాన్ మోషే, వ్యవసాయ శాఖ జెడి వై.రామకృష్ణ,పశు సంవర్ధక శాఖ డిడి టి. సత్యగోవింద్, తదితరులు పాల్గొన్నారు.