ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
1 min read– ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించండి
– వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశ నిర్దేశం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయని, క్షేత్రస్థాయిలో ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఎందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదు గుర్తించి, ఆసమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా కృషి చేయాలని కమలాపురం శాసనసభ్యులు పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, బుధవారం సాయంత్రం ఆయన స్థానిక మండల పరిషత్ సభా భవనంలో, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, గృహ సారథుల తో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అర్హులైన ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరిగినది అన్నారు, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల మేరకే పథకాలు అందేవని, నేడు పార్టీలకతీతంగా, కులాల కతీతంగా, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు, గత ప్రభుత్వంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలో తొక్కిన వైనం మనమందరం చూసామని, నేడు అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందన్నారు, చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా చేయడం జరిగిందన్నారు, మనం చేయాల్సిందల్లా ఇంకా ఎవరైనా మిగిలి ఉన్న లబ్ధిదారు లను గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు, అంతే కాకుండా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వివరించాలని తెలిపారు, గతంలో ఏవైనా సర్టిఫికెట్లు కావాలంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే వారని, నేడు ప్రభుత్వమే ప్రజల ముంగిటికి వెళ్లి వారికి ఏ ఏ సర్టిఫికెట్లు కావాలో గుర్తించి వాటిని ఇవ్వడం జరుగుతుందన్నారు, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయి గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా అక్కడే మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసి వారికి ఉచిత మందులతో పాటు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి, ప్రజలలోకి మనం వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించడం జరుగుతుందన్నారు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందని ఆయన తెలియజేశారు, కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని చేసినప్పుడే పార్టీ బలోపేతంగా ఉంటుందని ఆ దిశగా ప్రతి ఒక్క అడుగు వేయాలని ఆయన కార్యకర్తలకు నాయకులకు సూచించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిఎన్, భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, ముద్ది రెడ్డి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆరవేటి శ్రీనివాసరాజు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.