కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యేకి వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి పిలుపుమేరకు జిల్లాలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేదాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీస్ ఖాన్‌కి సిపిఐ నగర సమితి నాయకులు సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి నగర సహాయ కార్యదర్శి శ్రీ మహేష్ డి శ్రీనివాసరావు నగర కార్యవర్గ సభ్యులు ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజు డబ్బు బద్రి అన్వర్ భాష రామాంజనేయులు శ్రీకాంత్ డి హెచ్ పి ఎస్ నగర అధ్యక్షులు కుమార్ గౌస్ మరి కొంతమంది నాయకులు ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఉన్నారు అనంతరం ఎమ్మెల్యేకి రామకృష్ణారెడ్డి వివరిస్తూ కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురవని కారణంగా రైతులు వేసిన ప్రధాన పంటలైన పత్తి వేరుశనగ కంది ఆముదము జొన్న కొర్ర మొదలైన పంటలన్నీ లక్షలాది హెక్టార్లలో సాగు చేశారు వర్షాలు లేని కారణంగా మొలక దశలోనే పంటలు వాడిపోయి ఎండిపోవడం జరిగినది పంటలు సాగు చేయడానికి బ్యాంకులలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేసి రైతులు అప్పులలో తీవ్రంగా కూరుకుపోయినారు. విత్తనాలు ఎరువులు సేద్యపు ఖర్చులు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు చిల్లిగవ్వ చేతికి రాకపోవడంతో నిరాశ నిస్సృహాలతో ఆందోళన చెందుతున్నారు జిల్లాలో ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు తక్షణమే రైతులని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని గ్రామాల్లో ఇప్పటికే పనులు లేక సుదూర ప్రాంతాలకు వలస పోయి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసింది. రబి సీజన్ ప్రారంభమైంది కనుక ప్రభుత్వం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని ఆదుకోవడానికి తమరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఈరోజు తమరికి వినతిపత్రం ఇస్తున్నామని రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని అంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రతి వేరుశనగ ఆముదము కంది జొన్న పంటలకు ఎకరాకు 40000 పంట నష్టపరిహారం ఇవ్వాలని ఉల్లి మిర్చి మరియు ఉద్యాన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని పశుగ్రాసం పంపిణీ చేయాలని ప్రజలు రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు మొదలు పెట్టాలని దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడానికి కోసం కృషి చేయాలని ఎమ్మెల్ హాఫీజ్ ఖాన్‌కి వివరించడం జరిగినది తక్షణమే సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు ఎమ్మెల్యేకి తెలియజేశారు తక్షణమే సీఎంతో మాట్లాడి మన జిల్లాను కరువు జిల్లాగా మార్చే దానికోసం ప్రకటించడానికి కోసం కృషి చేస్తానని సిపిఐ నాయకులకు హామీ ఇచ్చారు.