ప్రభుత్వ కార్యాలయాలలో అలసత్వం.. అందని సేవలు
1 min readఅధికారులపై….. అధికార పార్టీ నాయకుల అసహనం.. …
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రభుత్వ కార్యాలయాలలో సేవలు అందాలంటే ప్రజలకు చుక్కలే స్వయంగా అధికార పార్టీ వైసీపీ నాయకులే సాక్షాత్తు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారంటే గడివేముల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పనితీరు ఎలా ఉందో అర్థమైపోతుంది అన్ని ఉన్న ఆన్లైన్ లో పొలం ఎక్కించాలన్న నెలల తరబడి తిప్పుకుంటూన్నారని గడిగారేవుల గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు 18 సెంట్ల పొలం ఆన్లైన్ లో ఎక్కించడానికి ఈ సీ అడంగల్ లో తమ పూర్వీకుల నుండి తమకు పొలం ఉందని ఆధారాలు చూపిన దీనిపై కలెక్టర్ కు స్పందనలో అర్జి ఇచ్చానని పై అధికారులు చెప్పిన తిప్పుకుంటూ నరకం చూపిస్తున్నారని వాపోయారు ఇదే కాదు అన్ని కార్యాలయాల లో అధికారులు విధులకు ఎప్పుడు హాజరవుతారో తెలియని పరిస్తితి అని మండల వాసులు వాపోయారు తమ కుటుంబాల పోషణ కోసం జీతాల కోసం పని చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మండలంలో సమస్యలు చాలా ఉన్నా నిధులు లేవంటూ అంతా బాగానే ఉన్నట్టు నటిస్తున్నారు ఎమ్మెల్యే వచ్చినప్పుడు హడావిడి చేయడానికి తప్పితే సాధారణ సమయాల్లో ఎప్పుడూ అధికారులు కనపడరని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్నిచోట్ల స్పందన ఎలా ఉంటుంది తెలియదు కానీ ప్రతి సోమవారం సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం లో విధిగా అన్ని విభాగాల మండల స్థాయి అధికారులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా ఇక్కడ పాటించరు ఏమన్నా క్షేత్రస్థాయిలో తమ అధికారి ఉన్నాడని స్థానిక సిబ్బంది తెలపడం కొసమెరుపు .. అధికార పార్టీ నాయకులకు మాట వినడం లేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?????