NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీపీఎస్సీలో పెద్ద కుంభ‌కోణం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీపీఎస్సీలో పెద్ద కుంభ‌కోణం జ‌రిగింద‌ని టీడీపీ జాతీయ కార్యద‌ర్శి నారాలోకేష్ ఆరోపించారు. 2018లో నోటిఫికేష‌న్ ఇస్తే…2020లో మెయిన్స్ ప‌రీక్షలు నిర్వహించార‌ని, 9,678 మంది పరీక్షల‌కు హాజ‌ర‌యితే.. 340 మందినే ఇంట‌ర్వ్యూకి పిలిచార‌ని తెలిపారు. ఏపీపీఎస్సీ ప‌రీక్ష రాసిన అభ్యర్థల‌తో నిర్వహించిన ఆన్ లైన్ స‌మావేశంలో ఆయ‌న ఈ ఆరోప‌ణ‌లు చేశారు. క‌నీస అర్హత లేనివారిని ఏపీపీఎస్సీ స‌భ్యులుగా నియ‌మించార‌ని విమ‌ర్శించారు. ఎలాంటి అధ్యయ‌నం లేకుండా డిజిట‌ల్ మూల్యాంక‌నం చేశార‌ని, ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, మార్కులు, జ‌వాబు ప‌త్రాలు వెల్లడించాల‌ని డిమాండ్ చేశారు. డిజిట‌ల్ మూల్యాంక‌నం టెక్నాల‌జీ మీద శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని కోరారు.

About Author