జగనన్నకు చెబుదాం” కార్యక్రమానికి అధికారులు గైర్హాజరు: జంపాన
1 min readపల్లెవెలుగు వెబ్ మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా సమావేశ మందిరంలో అక్టోబర్ 4వ తేదీన “జగనన్నకు చెబుదాం” కార్యక్రమంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి రజతాసింగ్ హాజరైనప్పటికీ, కృష్ణాజిల్లా అధికారులు గైరహాజర్ అయ్యారని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జగనన్నకు చెబుదాం* కార్యక్రమం పట్ల జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎంతో,బాధ్యతగా “ఉంటే కృష్ణా జిల్లాలో “జగనన్నకు చెబుదాం”కార్యక్రమం “లో నిర్లక్ష్యంగా ఉన్నకృష్ణా జిల్లా సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ రంగారావు, మచిలీపట్నం మండల సర్వేయర్ రాజబాబు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే శాంతిలు, ఉద్దేశ్యపూర్వకంగా గైర్హాజర్ అయినందున , ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం, సస్పెండ్ చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోగలందులకు ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా ” కె.ఎస్. జవహర్ రెడ్డికి, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ ,ఫిర్యాదు చేయడం జరిగిందని, ఒక ప్రకటనలో తెలియజేశారు.