వైవియులో సుగుణాకర్ కు డాక్టరేట్ ప్రదానం
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ శాఖ పరిశోధకులు వై.జె.సుగుణా కర్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. .వై వి యు బయోటెక్నాలజీ స్కాలర్ అయిన వై.జె.సుగుణాకర్ ఆచార్యులు పి చంద్రమతి శంకర్ పర్యవేక్షణలో ” స్టడీస్ అన్ గ్రీన్ సింథసిస్ అండ్ క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ సిల్వర్ నానోపార్టికల్స్ ఫ్రమ్ అన్నోనా రెటిక్యులం ఎల్. లీఫ్ ఎక్స్ ట్రాక్ట్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్ ” అనే అంశంపై చేసిన పరిశోధన చేసి గ్రంధాన్ని పరీక్షల విభాగానికి సమర్పించారు. నిపుణుల బృందం పరిశీలించి డాక్టరేట్ కు అర్హత ఉందంటూ ప్రకటించారు. ఈ మేరకు సుగుణాకర్ కు వై వి యు పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య యన్ .ఈశ్వరరెడ్డి డాక్టరేట్ ప్రకటించారు. వై.జె.సుగుణాకర్ రాసిన పరిశోధనా పత్రాలు ప్రఖ్యాత జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.డాక్టరేట్ పొందిన ఈయనను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ , రిజిస్ట్రార్ ఆచార్య వై.పి వెంకటసుబ్బయ్య , ప్రిన్సిపల్ ఆచార్య యస్.రఘునాథరెడ్డి , బయోటెక్నాలజీ శాఖ ఆచార్యులు, అధ్యాపకులు ,పరిశోధక విద్యార్థులు అభినందనందించారు.