జగనన్న ఆరోగ్య సురక్ష- పేద ప్రజలకు శ్రీరామరక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజల పాలిట శ్రీరామరక్ష అని మండల ప్రత్యేక అధికారి సిహెచ్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి లు అన్నారు, గురువారం మండలంలోని శివాలపల్లె వైయస్సార్ క్లినిక్ నందు సర్పంచ్ ముమ్మడి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వారు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉదయం నుండి, సాయంత్రం వరకు దాదాపు 300 మందికి పైగా ప్రజలకు వైద్యాధికారి బి చెన్నారెడ్డి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు, అలాగే ఆరు మందిని ఆరోగ్య శ్రీ కింద మెరుగైన వైద్య కొరకు రెఫర్ చేయడం జరిగిందన్నారు, అదేవిధంగా 45 మందికి వైయస్సార్ కంటి వెలుగు ద్వారా ఉచితంగా కండ్ల అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు, మిగతా వారికి జనరల్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైద్య రంగానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని విధంగా నేడు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఒకపక్క, ప్రజా ఆరోగ్యం ఇంకో పక్క అనే విధంగా నేడు ప్రజల ముంగిళ్ళకే వెళ్లి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు, దీంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల నందు శస్త్ర చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు, ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య రక్ష ద్వారా మెరుగైన వైద్య సేవలు పొందాలని వారు తెలియజేశారు, తదుపరి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీ మంతం తో పాటు, వారికి పౌష్టికాహారం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్( చిన్న) చిన్న కొండ రెడ్డి, ఆదిమూలం పుల్లయ్య, ఏ పి ఎం గంగాధర్, ఈవో పి ఆర్ డి సురేష్ బాబు, నిరంజన్ రెడ్డి, టి ఎన్ చంద్ర రెడ్డి, నిత్య పూజ్య, పుల్లారెడ్డి ,శివారెడ్డి ఐసిడిఎస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.